నిత్యపూజా విధానం

ఓం ॐ శుభంకర్యై నమః



అంశం:-
నిత్యపూజా విధానం:-

శుభంకరీ పీఠము సభ్యులందరికీ నమస్కారం.
శుభంకరీ పీఠమువారు 'నిత్యపూజా విధానం' ను ప్రారంభించి కొనసాగిస్తున్నారు. సభ్యులందరి ప్రేరణ,ప్రోత్సాహము ద్వారానే అది సాధ్యపడుతుంది, ముందుకి కొనసాగుతుంది... 'నిత్యపూజా విధానం' మన పీఠము యొక్క ప్రధాన అంశం.

నిత్యపూజా విధానమనేది సాధారణ విషయమేం కాదు. దానికై ప్రత్యేక నియమ నిష్ఠలతొ తగిన సమయమును కేటాయించి భక్తి శ్రధ్దలతో చేయవలసిన కార్యక్రమం. అందరి గోత్రనామాధుల మీద, జనముకొరకై, పీఠము శ్రేయస్సుకై ఈ విధానాన్ని ఒక ప్రత్యేక వ్యక్తితో అవిఘ్నముగా ముందుకు నడిపింపజేయాలి.

యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో, 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని, భక్తిగా భగవంతుడిని తలచుకున్నా, పూజ చేసుకున్నా మనజన్మకు సార్థకత లభిస్తుంది.


"ధర్మో రక్షతి రక్షితః" అన్నారు పెద్దలు.
ప్రజా శ్రేయస్సుకై మనమీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దానిని కొనసాగిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాలి.
మనము చేసే ఈ కార్యక్రమములు,సేవల వలన, సభ్యులకి, జనముకి మంచి ఫలితం కలిగి, వారు ఇంకొంచం మనకి సేవ చేయగలిగే భాగ్యాన్ని కలిగించుకోవాలి......మనమీ కార్యక్రమంలో పాల్గొంటూ... ప్రజలకీ విషయన్ని తెలియజేయాలి. వాళ్లలోకి మరింతగా ఈ విషయాన్ని తీసుకెళ్ళగలగాలి.

ఈ విషయంపై మీరు స్పందించి, మీయోక్క, సందేహాలను, సలహాలను, అభిప్రాయాలను తెలియజేయాలని కోరుకుంటున్నాము.

Phone:-9000303722
            9989122082
                           అడ్మిన్/శుభంకరీ ట్రస్ట్

No comments