Most Recent

శుభంకరీ గోశాల
శుభంకరీ గోశాల


శుభంకరీ గోశాల 2016 లో కేవలం మూడు గోవులతో మొదలై ఇవాళ 15 గోవుల వరకు చేరుకుంది. ఇందులో అరుదైన జాతి గోవుల్ను కూడా చేర్చుకోవడం జరిగింది. ఇంతవరకు రావడానికి ఎంతోమంది మహానుభావుల సహాయ సహకారాలు, గో దానాలు ఉన్నాయి.

ప్రస్తుతం మన శుభంకరీ సభ్యులు మురళీ రాజు గారి ఆధ్వర్యంలో గోశాల నిర్వహించడం జరుగుతున్నది. ఈ 15 గోవుల కోసం రెండు ఎకరాల భూమిని రెండు సంవత్సరాలపాటు అద్దెకు తీసుకోవడం జరిగింది. ఇక్కడే మరికొన్ని రోజుల్లో ఎండ వానల నుండి గోవుల్ని రక్షించడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ 15 గోవుల్ని చూసుకోవడానికి వాటి ఆహారానికి ప్రత్యేక మనుషులకి నెలకి 25 వేల పైనే ఖర్చు అవుతున్నది. ప్రస్తుతం శుభంకరి పరిషత్ వారు గోశాల నిర్వాహకులు మురళి రాజుగారు కలిసి ఆ ఖర్చును భరిస్తున్నారు. మీరు కూడా ఈ గో సేవలో భాగస్వాములైతే ఎంతో మంచి పుణ్యమని వివరించుచున్నాము.

నెలకి కనీసముగా 300 చెల్లించడం ద్వారా మీరు ఒక గోవుని పోషించగలరు. మీ సహాయ సహకారాలతో ఇక్కడి వరకు వచ్చిన గోశాల మరింత ముందుకు వెళుతుందనడంలో సందేహమే లేదు.

గోపూజ వలన ఎన్నో దోషాలు, గ్రహపీడనలు, పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటిది మనం గోవుల్ని పోషిస్తూ, వాటిని రక్షిస్తూ వాటికి సేవ చేయడం లో భాగస్వాములౌతున్నాం... ఎంతటి మహాభాగ్యం!. 🙏🏻

 గోశాల చిరునామా
శుభంకరీ గోశాల ముఖ్య నిర్వాహకులు
S. Murali Krishnam Raju,
గట్టుపల్లి , శంషాబాద్, హైదరాబాద్.

Bank Details :-

SBI Bank
Sagi Murali Krishnam Raju

A/C :- 00000020106725509

IFSC :- SBIN0012217
Nizampet branch , hydrabad

Contact number & PAYTM number :- 9000005053

                             ఓం శ్రీ శుభంకర్యై నమః 🙏

Unknown Tuesday 23 October 2018
గురుపౌర్ణమి పూర్వక మహాసర్పయాగం
గురుపౌర్ణమి పూర్వక మహాసర్పయాగం

శ్రీ శుభంకరీ ట్రస్ట్ సంస్థ వారు గురుపౌర్ణమి సహిత మహా సర్పయాగము నిర్వహిస్తున్నారు. 27-7-2018 న మొదలైన ఈ కార్యక్రమం 6-9-2018 వరకూ 41 రోజుల పాటు దీక్షగా జరుగుతుంది.

 సర్ప,కాల , ఇతర దోష నివారణా పూజలు,

మహా గణపతి పూజలు,
రుద్రాభిషేకం, న్యాస పూర్వక హోమాలు.

సుబ్రహ్మణ్య పూజలు.

ఇంకా అనేక పూజలు పాంప్లేట్ లో వివరించారు....

41 రోజుల పాటు జరిగే ఈ దీక్షా, కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక గొప్ప అవకాశం.... మరిన్ని వివరాలకు పాంప్లేట్లను ఒకసారి గమనించండి   🙏🏻




Unknown Thursday 26 July 2018
నిత్యపూజా విధానం

ఓం ॐ శుభంకర్యై నమః



అంశం:-
నిత్యపూజా విధానం:-

శుభంకరీ పీఠము సభ్యులందరికీ నమస్కారం.
శుభంకరీ పీఠమువారు 'నిత్యపూజా విధానం' ను ప్రారంభించి కొనసాగిస్తున్నారు. సభ్యులందరి ప్రేరణ,ప్రోత్సాహము ద్వారానే అది సాధ్యపడుతుంది, ముందుకి కొనసాగుతుంది... 'నిత్యపూజా విధానం' మన పీఠము యొక్క ప్రధాన అంశం.

నిత్యపూజా విధానమనేది సాధారణ విషయమేం కాదు. దానికై ప్రత్యేక నియమ నిష్ఠలతొ తగిన సమయమును కేటాయించి భక్తి శ్రధ్దలతో చేయవలసిన కార్యక్రమం. అందరి గోత్రనామాధుల మీద, జనముకొరకై, పీఠము శ్రేయస్సుకై ఈ విధానాన్ని ఒక ప్రత్యేక వ్యక్తితో అవిఘ్నముగా ముందుకు నడిపింపజేయాలి.

యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో, 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని, భక్తిగా భగవంతుడిని తలచుకున్నా, పూజ చేసుకున్నా మనజన్మకు సార్థకత లభిస్తుంది.


"ధర్మో రక్షతి రక్షితః" అన్నారు పెద్దలు.
ప్రజా శ్రేయస్సుకై మనమీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దానిని కొనసాగిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాలి.
మనము చేసే ఈ కార్యక్రమములు,సేవల వలన, సభ్యులకి, జనముకి మంచి ఫలితం కలిగి, వారు ఇంకొంచం మనకి సేవ చేయగలిగే భాగ్యాన్ని కలిగించుకోవాలి......మనమీ కార్యక్రమంలో పాల్గొంటూ... ప్రజలకీ విషయన్ని తెలియజేయాలి. వాళ్లలోకి మరింతగా ఈ విషయాన్ని తీసుకెళ్ళగలగాలి.

ఈ విషయంపై మీరు స్పందించి, మీయోక్క, సందేహాలను, సలహాలను, అభిప్రాయాలను తెలియజేయాలని కోరుకుంటున్నాము.

Phone:-9000303722
            9989122082
                           అడ్మిన్/శుభంకరీ ట్రస్ట్

Unknown Wednesday 17 May 2017
శుభంకరీ గో సేవ

     ఓం ॐ శుభంకర్యై నమః


“సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం”

సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని, గోమాత యజ్ఞమునకు తల్లి వంటిదని ఈ శ్లోకం అర్థం. 


శుభంకరీ గోశాల  చిరునామా

గోమాత సర్వ శుభ రూపిణి. ముక్కోటి దేవతలకు నిలయం గోమాత. గోసేవ, గోపూజ వలన అజ్ఞానాంధకారాలు తొలగి ఎన్నో ఫలితాలు లభిస్తాయని శాస్త్రం తెలియజేస్తుంది.
శుభంకరి పీఠమువారు గోసేవను ప్రారంభించి,
నిర్వహించుచున్నారు. మీరుకూడా ఇందులో భాగస్వాములై,మీకు తోచిన సేవ చేయగలరు'
అనుకున్న మమ్ములను సంప్రదించండి... .

-(నెల సరి చందా₹ 1116= గో పూజ కొరకు / నెల సరి చందా₹ 502 గో గ్రాసము కొరకు నెలకు ఒక సారి మాత్రమే)-

గో సేవ కొరకు మీరు ఏవిధముగా అయినా సాయ పడవచ్చును. గోవులకు వేసే ఆహార పదార్దాలు దాణా, గడ్డి,ఉలవలు, తవుడు, పచ్చ గడ్డి వంటి ఆహారపదార్థాలు కూడా స్వీకరించబడును.

రానున్నది వర్షాకాలము కావున ఆవులకు రక్షణ గా షెడ్డు ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మీకు తోచిన విధముగా మీ సహాయ సహకారాలు అందించగలరు.


గోమాత



కపిల గోవు


శుభంకరీ గోశాల చిరునామ:- గట్టుపల్లి, శంషాబాద్, హైద్రాబాద్.

Phone:-9000303722
           9989122082
                           అడ్మిన్/శుభంకరీ పీఠము.

Unknown Monday 15 May 2017
శుభంకరీ ఆరోగ్య భీమా

    ఓం ॐ శుభంకర్యై నమః


'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు పెద్దలు. జీవితం ఒక అంతస్తు అయితే...
ఆరోగ్యం,సంపద, దైవభక్తి, ప్రశాంతత దానిని నిలబెట్టే ప్రదాన స్థంబాలు. మనకు ఏమి ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శుభంకరీ పీఠము వారు స్తోమత లేని పేదలకు, వృద్ధులకు, ఆరోగ్య భీమా కల్పించాలని​ ముందుకు వస్తున్నారు. ఆరోగ్య భీమా సౌకర్యమును సంవత్సరానికి కనీసం 6 గురి నుండి, 14 మందిదాకా అందించడం శుభంకరీ పీఠము వారి ఉద్దేశ్యం. ఈ కార్యం కోసం పీఠము వారు తమ వంతు బాధ్యతతో ముందుకు​ వస్తున్నారు.


శుభంకరీ పీఠము వారిచే అందజేయబడ్డ హెల్త్ కార్డులు.


ఈ కార్యక్రమంలో మీవంతు సాయం మీరు కూడాచేయాలని మనవి. మనందరి కృషి ద్వారా సరైన వైధ్యం పొందలేని ఎంతో మందికి మనం సహాయం చేసినవారమౌతాము. ఈ సంస్థాగత కార్యక్రమాలలో లో  అందరూ కార్యకర్తలే. పరోపకారార్ధం కోసమే ఈ సంస్థ నడుచుచున్నది.

మరిన్ని వివరాలకు​ మమ్మల్ని సంప్రదించండి:-

ఫోన్ - 9989923660 9000303722 9989122082

అడ్మిన్ / శుభంకరీ పీఠము

Unknown Friday 12 May 2017
శుభంకరీ పీఠము

ఓం ॐ శుభంకర్యై నమః




అందరికి నమస్కారం 🙏 ఇది మన శుభంకరీ బ్లాగ్. 'శుభంకరీ పీఠము' మానవసేవే మాధవ సేవ అన్న
నినాదముతో , దైవసేవ ఆధ్యాత్మిక సేవ, మనవ సేవే భాగము గా ప్రారంభించడం జరిగింది.



మహాజనులారా! ప్రతి ప్రాణి ధర్మమును గ్రహించుట జరుగుచున్నది గాని ఆచరించుట తక్కువగా ఉన్నది. మన పూర్వికులు మహాత్ములు స్వధర్మాచరణ జీవరక్షణ హేతువని ప్రభోదించినారు. పరోపకారార్దం ఇదు శరీరం అన్న సూక్తిని పరమావధిగా భావించి శ్రీ శంకర భగవత్పాదులు ఇత్యాదిగా గల మహాత్ములి ప్రభోధమును అనుసరించి మేము అందరి సహాయ సహకారములతో ఈ సంస్ద నిర్మాణ,నిర్వహణ చేయ సంకల్పించితిమి. మేము ఈ సంస్ధలో కేవలం కార్యకర్తలము మాత్రమే దీని మూలము వేదం (వేదోఖిల ధర్మమూలం). దాతలు పరమేశ్వర స్వరూపము, గ్రహితలు విష్ణురూపులు, ఐశ్వర్యం ఈశ్వరాదిఛ్చేత్ మహావిష్ణు స్వరూపాయ గ్రహితే అన్న ప్రమాణం అనుసరించి స్తోమత లేనివారికి, ఉన్నవారికి సేవ చేయటమే మా ముఖ్య ఉద్దేశం.


ధర్మో రక్షతి రక్షితః : ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది:-

మానవ జన్మ చాల గొప్పది ఎంతో పుణ్యం చేసుకంటే కానీ మనకి ఈ మానవ జన్మ లభించదు. అట్టి మనవ జన్మ ప్రసాదించిన భగవంతునికి మనమెంతో రుణపడి ఉన్నాం. ఈ యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి భక్తిగా మనం నమస్కరించి పూజించకపోతే మనకి ఏ విధంగా సార్థకత లభిస్తుంది!?.

అందుకు ఈ యొక్క శుభంకరీ సనాతన ధర్మప్రచార పరిషత్ ట్రస్ట్ మీకు సహకరిస్తుంది. ఈ ట్రస్ట్ యందు అందరు దాతలై (గో దేవత - దేవతలు బ్రాహ్మణుల అనుగ్రహము పొందగలరు). ఈ యొక్క వైదిక ధార్మిక కార్యక్రమము నందు పాల్గొని మీకు తోచిన విధంగా విరాళాలు సమర్పించి మీకు తెలిసిన వారికి చెప్పి, ఈ సంస్థ కి సహాయ పడగలరు. భగవంతుని అనుగ్రహము పొందగలరు. ఈ సంస్దకు సంభందించిన పురోహితులు, పండితులు శాస్త్రీయముగా సాంప్రదాయముగా మీకు కావలసిన శుభకార్యక్రమములు, అశుభకార్యక్రమములు, యజ్ఞములు, ఇత్యాది వ్రతములు విధిగా తక్కువ ఖర్చుతో చేయించబడును.

మమ్మల్ని సంప్రదించండి:-
ఫోన్ - 9989923660 9000303722 9989122082
అడ్మిన్ / శుభంకరీ పీఠము.

Unknown Thursday 11 May 2017